తల్లి నేర్పిన మాటలను సుశాంత్ మర్చిపోయాడు... వాళ్లను నమ్మాడు: కంగన
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య
- సుశాంత్ మృతిపై మీడియాను ప్రశ్నించిన కంగన
- అతడు బలహీన మనస్కుడని ఎలా చెబుతారంటూ ఆగ్రహం
సుశాంత్ ఆత్మహత్యకు కారణం బలహీనమైన మనస్తత్వమేని మీడియా చెబుతోందని, దేశం మొత్తమ్మీద ర్యాంక్ సాధించిన విద్యార్థి బలహీన మనస్కుడని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. అతడి తొలి సినిమా 'కై పో చే'ను ఎవరూ ఎందుకు ప్రోత్సహించలేదని, పరమచెత్తగా ఉన్న 'గల్లీబాయ్' సినిమాకు అన్ని అవార్డులు ఎలా లభించాయని కంగన ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ నటించిన 'చిచ్చోరే' అద్భుతంగా ఉన్నా, ఎందుకు ఎవరూ పట్టించుకోలేదని కంగన నిలదీశారు.