బాలీవుడ్ వైపు మళ్లిన వార్నర్... ఈసారి అక్షయ్ కుమార్ పాటకు స్టెప్పులు

 David Warner makes another Tik Tok video
షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ కాలంలో కాలక్షేపం కోసం టిక్ టాక్ వీడియోలతో సందడి చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వీడియో రూపొందించాడు. ఇప్పటివరకు టాలీవుడ్ హిట్ సాంగ్స్ తో మైమరపించిన వార్నర్ ఈసారి బాలీవుడ్ వైపు మళ్లాడు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్-4 చిత్రంలోని 'బాలా బాలా సైతాన్ కా సాలా' అనే సాంగ్ కు తన పిల్లలతో కలిసి టిక్ టాక్ వీడియో చేశాడు.

ఆస్ట్రేలియాలో ఆర్నెల్ల పాటు లాక్ డౌన్ విధించడంతో ఇప్పట్లో క్రికెట్ కార్యకలాపాలు మొదలయ్యే వీల్లేని పరిస్థితుల్లో.... వార్నర్ వరుసగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను తరచుగా అలరిస్తున్నాడు. ముఖ్యంగా, మహేశ్ బాబు, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Go Back to Shorts
David Warner
TikTok
Video
Akshay Kumar
Bala Bala
Housefull-4
Bollywood
Lockdown
Corona Virus
Australia

More Telugu News