బయటి రాష్ట్రాల నుండి విచ్చలవిడిగా ఎన్డీపీ లిక్కర్ తరలివస్తోంది: దేవినేని ఉమ

devineni fires on ycp
  • వైసీపీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు  
  • ఏపీలో సారా ఏరులై పారుతుంది
  • నాసిరకం మద్యం, సారాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి
  • వైసీపీ నేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు?  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో మద్యం అమ్మకాల ప్రభుత్వ తీరును ఆయన నిలదీశారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. బయటి రాష్ట్రాల నుండి విచ్చలవిడిగా ఎన్డీపీ లిక్కర్ తరలివస్తోందని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఏపీలో సారా ఏరులై పారుతుందని ఆయన చెప్పారు. నాసిరకం మద్యం, సారాలతో పోతున్న ప్రజల ప్రాణాలకు, వైసీపీ నేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు? అని సీఎం జగన్‌ను ఆయన ట్విట్టర్‌లో నిలదీశారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News