ఫ్యాన్స్ పై నిందలు మోపడంలో అర్థం లేదు: పూనమ్ కౌర్

Poonam Kaur comments about fans and issues
  • మధ్యలో ఉన్నవాళ్లే అసలు కారకులంటూ పూనమ్ వ్యాఖ్యలు
  • అభిమానులు అమాయకులని వెల్లడి
  • అనేక పర్యాయాలు తాను కూడా ఇబ్బందిపడ్డానని వివరణ
ఓ హీరో అభిమానులు తనను తీవ్రస్థాయిలో వేధిస్తున్నారంటూ నటి మీరా చోప్రా పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో నటి పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ ను నిందించడంలో అర్థం లేదని, వారు నిజంగా చాలా అమాయకులని వ్యాఖ్యానించారు.

మధ్యలో ఉన్న వాళ్లే ఇలాంటి ఘటనలకు కారకులని, ప్రయోజనాలను ఆశించి వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు. అనేక పర్యాయాలు అకారణంగా తనను కూడా వివాదాల్లోకి లాగినా, ఇప్పటివరకు ఒక్క సంఘటనలోనూ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేయలేదని పూనమ్ కౌర్ వెల్లడించారు. నన్ను ఇబ్బందులకు గురిచేసిన వాళ్లపైనే ఫిర్యాదు చేశాను తప్ప, అభిమానులపై ఫిర్యాదు చేయలేదని వివరించారు.
Go Back to Shorts
Poonam Kaur
Fans
Comments
Meera Chopra
Tollywood

More Telugu News