sudheer: కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా యంగ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేసిన వీడియో వైరల్!

  • సీతారామరాజు డైలాగులు చెప్పిన సుధీర్
  • బ్రిటిష్ వారు కాల్చుతున్నప్పుడు సినిమాలో డైలాగులు
  • అచ్చం కృష్ణలా చెప్పిన సుధీర్
sudheer birth day wishes

ఈ రోజు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో సుధీర్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కృష్ణ అభిమానులను అలరించేలా ఆయన అల్లూరి సీతారామ‌రాజు సినిమాలోని డైలాగులను చెప్పాడు.

ఓ వైపు ఆ సినిమాలో కృష్ణ నటించిన సీన్‌ను, మరోవైపు కృష్ణ చెప్పిన డైలాగులను అచ్చం అలాగే చెబుతూ సుధీర్‌ బాబు ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియో ఘట్టమనేని అభిమానులను ఆకర్షిస్తోంది. అల్లూరి సీతారామ రాజు సినిమాలో బ్రిటిష్ సైనికులు అల్లూరిని తుపాకులతో కాల్చుతున్నప్పుడు 'ఒక్క సీతారామ రాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుట్టుకొస్తారు..' అంటూ ఈ డైలాగులు ఉంటాయి.

More Telugu News