Nitin: డిసెంబరులో టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి?

nitin marriage with shalini
  • లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే వాయిదా పడ్డ పెళ్లి
  • కొత్త ముహూర్తం పెట్టిన కుటుంబ సభ్యులు?
  • ఫాంహౌస్‌లో వివాహం?
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా టాలీవుడ్ నటుడు నితిన్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఏప్రిల్ 16నే ఆయన పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే,  కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

కాగా, ఆయన పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. తన ప్రేయసి శాలినితో నితిన్ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితమే జరిగింది. ప్రస్తుతం నితిన్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

More Telugu News

Nitin
Tollywood
marriage