పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా 'బిగ్ బాస్ 2' విజేత కౌశల్
- 'బిగ్ బాస్' తో మంచి క్రేజ్
- ఆశించినస్థాయిలో రాని అవకాశాలు
- ఆది సాయికుమార్ సినిమాలో ఛాన్స్
అయితే తాజాగా కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు తెలుస్తోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారట. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు. ఈ పాత్రతో కౌశల్ తన సత్తా చాటుకుంటాడేమో చూడాలి.