Brahmanandam: ఇండస్ట్రీలో డబ్బుకు ప్రాధాన్యతనివ్వని వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు: బ్రహ్మానందం

Brahmanandam
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన కమెడియన్స్ లో బ్రహ్మానందం ముందువరుసలో కనిపిస్తారు. ఆయన పోషించిన ఎన్నో విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులకు కితకితలు పెడుతూనే ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం పారితోషికం విషయంలో చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారనే టాక్ వుంది. ఏ రోజు పారితోషికాన్ని ఆ రోజునే వసూలు చేయడంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారని చెప్పుకుంటూ వుంటారు.

తాజాగా బ్రహ్మానందం మాట్లాడుతూ .. ఆ విషయం నిజమేనని అంగీకరించారు. "చిత్రపరిశ్రమలో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. డబ్బుకి ప్రాధాన్యతని ఇవ్వని కొంతమంది ఎలాంటి  పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. నాకే కాదు .. చాలామందికి తెలుసు. అందువలన నాకు రావలసిన డబ్బు విషయంలో కాస్త గట్టిగానే వుంటాను. అలా నేను 100 రూపాయలు సంపాదిస్తే .. అందులో 10 రూపాయలు ఇతరులకి సాయాన్ని అందించడం కోసం కేటాయిస్తాను. అలా ఇంతవరకూ  ఆర్థికపరమైన అండలేని 23 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిపించాను. చేసిన సాయాలను గురించి నేను చెప్పుకోను .. అందువలన నాపై విమర్శలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Brahmanandam
Actor
Tollywood

More Telugu News