విశాఖ దుర్ఘటనపై దర్యాప్తునకు దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం
- ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్ధమైన ‘ఎల్జీ’
- దక్షిణ కొరియా నుంచి రానున్న ప్రత్యేక బృందం
- ఈ బృందంలో 8 మంది సభ్యులు
ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందంలో 8 మంది సభ్యులు ఉన్నట్టు తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్ కు గల కారణాల విశ్లేషణతో పాటు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది.