Dubai: వ్యాపారి బంపరాఫర్... భార్యా, బిడ్డలను ఇల్లు చేరిస్తే రూ. 10 లక్షల రివార్డు!

Offer from Business man 10 Lakhs reward
  • కర్ణాటకలో ఉండిపోయిన శ్రీకుమార్ భార్య, చిన్న కుమారుడు
  • తమిళనాడులో చిక్కుబడిపోయిన పెద్ద కుమారుడు
  • కేరళలోని అలప్పుజ ప్రాంతానికి చేర్చాలని వినతి
లాక్ డౌన్ కారణంగా కర్ణాటక, తమిళనాడుల్లో చిక్కుబడిపోయిన తన భార్యా బిడ్డలను కేరళలోని ఇంటికి చేరిస్తే, రూ. 10 లక్షలు రివార్డుగా ఇస్తానని దుబాయ్ కి చెందిన భారత సంతతి వ్యాపారవేత్త కేఎస్ శ్రీకుమార్ ఆఫర్ ఇచ్చారు. ఇదేమీ పబ్లిసిటీ స్టంట్ కాదని తన ఫేస్ బుక్ ఖాతాలో వివరణ ఇచ్చిన ఆయన, తన భార్య, చిన్న కుమారుడు మంగళూరులో ఉండిపోయారని, పెద్ద కుమారుడు తమిళనాడులోని తిరుచానూరులో చిక్కుకున్నాడని, వారిని అలప్పుజలోని తన ఇంటికి చేర్చాలని ఆయన కండిషన్ పెట్టారు.

వారిని ఒక చోటకు చేర్చేందుకు తానెంతో శ్రమించి విఫలం అయ్యానని, రెండు రాష్ట్రాల పొలిటికల్ లీడర్లను సైతం సాయం చేయాలని కోరగా, వారేమీ చేయలేదని, ఈ కారణంతోనే భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నానని శ్రీకుమార్ వ్యాఖ్యానించారు. తన భార్యా, పిల్లలను ఒకచోటకు చేర్చేందుకు ఈ మొత్తం తానిస్తున్న నజరానాగా అభివర్ణించారు. అన్నట్టు ఈ ఆఫర్ 12వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందట.
Dubai
Business Man
Offer
House Mates
Family
Lockdown

More Telugu News