ఇవాళ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. మీడియా మిత్రులకు అభినందనలు: చంద్రబాబునాయుడు
- వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమిస్తున్నారు
- పాలకుల వేధింపులను తట్టుకుంటున్నారు
- మీడియా మిత్రుల కృషి నిరుపమానం
సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో, అణగారిన వర్గాల హక్కుల సాధనలో కీలక భూమిక మీడియాదేనని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారని, ‘కరోనా’పై పోరాటంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా మిత్రులు ఉన్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభం ‘మీడియా’ అని, పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ముందుండి పోరాడిందని ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.