రేపు ఉదయం 9 గంటల లోగా కన్నా తన ఆరోపణలను నిరూపించాలి!: మంత్రి బుగ్గన సవాల్
- కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న కన్నా
- రేపు ఉదయంలోగా నిరూపించాలని డిమాండ్
- నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్
కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు కన్నా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. రేపు ఉదయం 9 గంటల్లోగా ఆరోపణలను నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.