ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. పీవీ మోహన్‌కు బాధ్యతలు
- ప్రస్తుత ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌పై వేటు
- ఏపీకి చెందిన సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
- పంజాబ్‌కు సచిన్ పైలట్, అస్సాంకు భూపేష్ భగేల్ ఇన్‌ఛార్జ్‌లు
- నియామకాలను ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పార్టీలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మోహన్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న పీవీ మోహన్, గతంలో కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పనిచేశారు. తాజా మార్పులతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత సిరివెళ్ల ప్రసాద్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా, రాజస్థాన్ సీనియర్ నేత సచిన్ పైలట్‌కు పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కు అస్సాం ఇన్‌ఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు గుజరాత్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు కేటాయించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.