వెలిగొండ కాలువలో పెను విషాదం.. పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు గల్లంతు
- వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
- గల్లంతైన వారిలో పెళ్లికి ఒక్కరోజు ముందు కాబోయే వరుడు
- ఈతకు వెళ్లి నీటి ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయిన స్నేహితులు
- ప్రాజెక్టు ప్రారంభమయ్యాక ఐదు రోజుల్లో ఇది రెండో ప్రమాదం
పెళ్లికి ఒక్కరోజు ముందు ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరియాల్సింది. బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన పెళ్లి పందిరి మూగబోయింది. సరదాగా ఈతకు వెళ్లిన కాబోయే పెళ్లికొడుకు, అతని స్నేహితుడు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువలో గల్లంతవ్వడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయవిదారక ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కటకానిపల్లెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కటకానిపల్లె గ్రామానికి చెందిన పుష్పాల రాజ్‌కుమార్‌కు (23) ఈ నెల 7వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులతో కలిసి మొత్తం ఏడుగురు పార్టీ చేసుకునేందుకు గ్రామ సమీపంలోని వెలిగొండ ఫీడర్ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో రాజ్‌కుమార్, అతని స్నేహితుడు వినయ్‌కుమార్ (22), మరో స్నేహితుడు రాజు సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో ఫీడర్ కాలువలో నీటి ప్రవాహం అత్యంత ఉద్ధృతంగా ఉంది. ఈ విషయాన్ని అంచనా వేయకుండా నీటిలోకి దిగడంతో ముగ్గురూ ప్రవాహ వేగానికి అదుపుతప్పారు. వారిలో రాజు అతికష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, రాజ్‌కుమార్, వినయ్‌కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్నేహితుల కళ్ల ముందే వారు గల్లంతవ్వడంతో ఒడ్డున ఉన్నవారు షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాధితుల ఫిర్యాదుతో యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్, పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైన ఐదు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. ప్రాజెక్టు ప్రారంభమైన తొలిరోజే సుంకేసుల - కలనూతల మార్గంలో బొలెరో వాహనం బోల్తా పడి ముగ్గురు గాయపడ్డారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున కాలువ వద్దకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ప్రజలు పెడచెవిన పెట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.