జేఎంఎం సీనియర్ నేత.. మంత్రి సుదివ్య కుమార్ ఆకస్మిక మృతి
- గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- సీఎం హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు
- సుదివ్య మృతి పార్టీకి తీరని లోటన్న జేఎంఎం
ఝార్ఖండ్ ప్రభుత్వంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత సుదివ్య కుమార్ (56) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి గిరిడీలోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో, కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సోనుగా గుర్తింపు పొందిన సుదివ్య కుమార్.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్‌లో పలు కీలక శాఖలను నిర్వహించారు. ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటకం, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా ఆయన సేవలందించారు. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
సుదివ్య మరణం పార్టీకి, ప్రభుత్వానికి తీరని లోటని జేఎంఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ‘సోను భయ్యా’ అంటూ ఎక్స్‌లో భావోద్వేగ నివాళి అర్పించారు. గిరిడీ నియోజకవర్గం నుంచి 2019, 2024 ఎన్నికల్లో సుదివ్య ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన 2024లో సోరెన్ అరెస్ట్ సమయంలో పార్టీని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆయన ప్రభుత్వ పనులపై కర్ణాటక పర్యటనకు వెళ్లివచ్చారు. సుదివ్య కుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.