'తలైవి'లో శోభన్ బాబు పాత్ర నిడివిపై సందేహాలు
- కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా 'తలైవి'
- కొంతవరకూ పూర్తయిన చిత్రీకరణ
- శోభన్ బాబు పాత్రలో జిషు సేన్ గుప్తా
జయలలితతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా శోభన్ బాబు కనిపిస్తారు. అందువలన ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా వుంది. ఈ పాత్ర కోసం జిషు సేన్ గుప్తాను తీసుకున్నారు. అయితే జయలలిత అభిమానుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో, శోభన్ బాబు పాత్ర నిడివిని తగ్గించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపైనే కోలీవుడ్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత జీవితంలో ఆయన పాత్రను ఎంతవరకూ చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.