మహేశ్ నన్ను 'సార్' అని పిలిచేవారు: 'అల్లరి' నరేశ్

Maharshi Movie
  • 'మహర్షి' చేయడం మరిచిపోలేని అనుభవం
  •  ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
  • వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే
తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ కి మంచి క్రేజ్ వుంది. హీరోగా చాలా వేగంగా ఆయన 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ మధ్య 'మహర్షి' సినిమాలో 'అల్లరి' నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. ఆ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు.

'మహర్షి' సినిమాలో చేయడం ఒక మరిచిపోలేని అనుభవం. నటన పరంగా నాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన పాత్ర అది. ఆ సినిమా షూటింగు సమయంలో మహేశ్ బాబు నన్ను 'సార్' అని పిలిచేవారు. ఆయన అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. సెట్లో అందరితోను ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు. మహేశ్ బాబును చాలా దగ్గరగా చూసే అవకాశాన్ని ఈ సినిమా నాకు కలిగించింది. నటన పరంగానే కాదు, వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే' అంటూ చెప్పుకొచ్చాడు. 'అల్లరి' నరేశ్ తాజా చిత్రంగా 'నాంది' రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Allari Naresh
Mahesh Babu
Maharshi Movie

More Telugu News