Nikhil: సిక్స్ ప్యాక్ కోసం నిఖిల్ కసరత్తు

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన సీక్వెల్ 
  • హిట్ కొట్టాలనే పట్టుదలతో దర్శకుడు
Karthikeya 2 Movie

నిఖిల్ కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'అర్జున్ సురవరం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. గతంలో విజయాన్ని సాధించిన 'కార్తికేయ'కి ఇది సీక్వెల్. 'కార్తికేయ 2' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాలో నిఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రోగ్రెస్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో 4 వారాలలో పూర్తి షేప్ ను సాధిస్తానని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చందూ మొండేటికి ఈ సీక్వెల్ ఊరటనిస్తుందేమో చూడాలి.

More Telugu News