'బంగార్రాజు' సినిమాలో లావణ్య త్రిపాఠి
- నిదానంగా సాగుతున్న కెరియర్
- 'అర్జున్ సురవరం'తో హిట్
- నాగ్ మూవీలో మళ్లీ అవకాశం
ఇక 'బంగార్రాజు' సినిమాలోను ఆమెకి ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో యంగ్ నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి అలరించింది. ఆ సినిమాకి సీక్వెల్ గానే 'బంగార్రాజు' రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో .. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠికి అవకాశం లభించింది. కథానాయికగా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారా? లేదంటే వేరే కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది.