Corona Virus: 2011లో వచ్చిన ఈ సినిమా చూడండి.. అంతా అర్థమవుతుంది: సినీ నటి వరలక్ష్మి

  • 2011లో వచ్చిన 'కంటేజియన్' సినిమా
  • వైరస్ కథాంశంతో తెరకెక్కిన మూవీ
  • వైరస్ వ్యాప్తి గురించి ఈ సినిమా చూస్తే అర్థమవుతుందన్న వరలక్ష్మి
Watch Contagion movie says Varalakshmi

ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కరోనా వైరస్, ఐసొలేషన్, క్వారంటైన్, లాక్ డౌన్ గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచం మొత్తం కరోనా గురించి వణికిపోతోంది. ఈ నేపథ్యంలో సినీ నటి, సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి మాట్లాడుతూ, అచ్చం ఇలాంటి కథతోనే 2011లో 'కంటేజియన్' అనే సినిమా వచ్చిందని తెలిపింది. ఆ సినిమా నిండా ఇప్పుడు మనం వింటున్న పదజాలమే ఉంటుందని... వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది.

More Telugu News