విరాళాన్ని ప్రకటించి.. హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచిన ప్రణీత
- సినీ కార్మికులకు లక్ష విరాళాన్ని ప్రకటించిన ప్రణీత
- 50 కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటన
- తమ ఫౌండేషన్ తరపున 500 కుటుంబాలకు సాయం
ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, ఈ కష్ట కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని... తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదే అని తెలిపింది. ఎఫర్ట్స్ ఫర్ గుడ్, లాజికల్ ఇండియన్ సంస్థలతో కలిసి హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రణీత ఫౌండేషన్ 500 కుటుంబాలకు సాయం చేసేందుకు సన్నాహకాలు చేస్తోందని చెప్పింది.