Varun Tej: వరుణ్ తేజ్ సినిమాలో లావణ్య త్రిపాఠి

  • షూటింగు దశలో వరుణ్ తేజ్ మూవీ 
  • కథానాయికగా  సయీ మంజ్రేకర్ పరిచయం 
  •  కథకి కీలకంగా నిలిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
Kiran Korrapati Movie

వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ .. సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇందుకోసం వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా 'సయీ మంజ్రేకర్' పరిచయం కానుంది. ఈ పాత్రకి కొత్త కథానాయిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట.

ఇక తాజాగా లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందట. ఆ ఎపిసోడ్ లో మరో కథానాయిక ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఆ పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

More Telugu News