RRR: రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల!

rrr movie poster
షార్ట్స్‌లో చూడండి
ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను  ఆ సినిమా బృందం విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌ హీరోలు రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. పలు భాషల్లో ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సినిమాకు 'రౌద్రం.. రణం.. రుధిరం' పేరు పెట్టారు.
                              

'ఆర్ఆర్ఆర్' టైటిల్‌పై ఎన్నో ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటన్నింటికీ రాజమౌళి నేటితో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు మరోవైపు తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తోన్న ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Go Back to Shorts
RRR
Rajamouli
Tollywood

More Telugu News