ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం
- రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్ఞానేశ్వరి
- తల్లి మరణంతో తీవ్ర విషాదంలో రత్నవేలు
"నా కళ్లలోకి చూసి నా ఆశయాలను, ఆకాంక్షలను గ్రహించగల వ్యక్తి మా అమ్మ. ఎప్పుడూ నా వెన్నంటే నిలిచింది. జీవితంలో ఏమేం సాధించాలని అనుకున్నానో అన్నింటినీ సాకారం అయ్యేలా చేసిన అమృతమూర్తి మా అమ్మ. ఇవాళ నేనీ స్థితిలో ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం. నా స్ఫూర్తి, నా శక్తి, నా సంతోషం అన్నీ ఆమే. అమ్మా, నిన్నెంతో మిస్సవుతున్నాను. జీవితకాలం నీకు రుణపడివుంటాను" అంటూ ట్వీట్ చేశారు.