సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని పూజ హెగ్డే నిర్ణయం!
- ప్రభాస్ తాజా చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే
- జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరుగు పయనం
- 14 రోజలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటానని ప్రకటన
ఈనేపథ్యంలో, టాలీవుడ్ నటి పూజ హెగ్డే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుంది. ప్రభాస్ తాజా చిత్రంలో పూజ నటిస్తోంది. షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ అక్కడి నుంచి తిరుగుపయనమైంది. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ కు వచ్చిన వెంటనే తాను చేయబోయే పని... ఇంట్లో తనను తాను నిర్బంధించుకోవడమని చెప్పింది.