Sathyadev: 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' నుంచి ఆహ్లాదకరమైన లిరికల్ వీడియో

  • వెంకటేశ్ మహా నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  • అనుభూతి పరిమళాన్ని వెదజల్లే బిజిబల్ సంగీతం 
  • ఆకట్టుకుంటున్న విజయ్ ఏసుదాస్ గానం  
Uma Maheshvara Ugra Rupasya Movie

దర్శకుడు వెంకటేశ్ మహా పేరు వినగానే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న ఆయన, సత్యదేవ్ ప్రధాన పాత్రధారిగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ ఫొటోగ్రాఫర్ గా కనిపించనున్నాడు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియోను వదిలారు.

"నింగి చుట్టే మేఘం ఎరుగదా ఈ లోకం గుట్టూ .. మునిలా మెదలదు నీ మీదొట్టు .. కాలం కదలికలతో జోడీకట్టు .. " అంటూ ఈ పాట సాగుతోంది. బిజిబల్ సంగీతం .. విశ్వ సాహిత్యం .. విజయ్ ఏసుదాస్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ప్రధాన పాత్రను ప్రకృతికిస్తూ, అనుబంధాలు .. అనుభూతుల కలయికగా ఈ కథ సాగనున్నట్టు ఈ పాటను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News