Chiranjeevi: చిరూ సినిమాలో మోహన్ బాబు .. క్లారిటీ ఇచ్చిన యూనిట్

  • షూటింగు దశలో చిరంజీవి మూవీ 
  •  ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు అంటూ ప్రచారం
  • కథానాయికగా త్రిష  
Mohan Babu not part of Koratala Siva Movie

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథ ఇది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను మోహన్ బాబు పోషించనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ విషయంపై సినిమా యూనిట్ సభ్యులు స్పందించారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ .. నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే.

More Telugu News