ఆర్బీఐ కనికరించకున్నా... అన్ని రకాల రుణాలపై వడ్డీని తగ్గించిన ఎస్బీఐ!
- 5 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు
- 10వ తేదీ నుంచి అమలులోకి
- వెల్లడించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ను తగ్గించడం ఇది వరుసగా 9వ సారి కావడం గమనార్హం. ఆర్బీఐ రెపో రేటును సవరించకున్నా, రూ. లక్ష కోట్ల వరకూ దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ను ప్రకటించిన నేపథ్యంలోనే, వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది.
కాగా, నిన్న జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.