ప్రభాస్ మూవీ టైటిల్ మారుతుందా?

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు ఒక భాగస్వామిగా వున్నారు. ఈ సినిమాకి మొదటినుంచీ 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు తాజాగా 'ఓ డియర్' .. 'రాధేశ్యామ్' అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ సినిమా కోసమే ఈ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించి వుంటారా? అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ .. పూజా హెగ్డే చేస్తున్న ఈ సినిమా ప్రేమకథాంశం కావడం వలన, ఈ సినిమా కోసమే ఆ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ కి 'డార్లింగ్' వంటి టైటిల్ కలిసి రావడం వలన కూడా ఇప్పుడు టైటిల్ మార్పుకు కారణం కావొచ్చని భావిస్తున్నారు.  
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Radha Krishna Kumar Movie

More Telugu News