Byreddy Rajasekar Reddy: రాయలసీమ యూనివర్సిటీ సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలి : బీజేపీ నేత బైరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ సమస్యలతో కునారిల్లుతోందని, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా యూనివర్సిటీని సందర్శించి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న రాయలసీమను బతికించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'గ్రేటర్‌ రాయలసీమ'ను డిమాండ్‌ చేస్తున్న నాయకుల మాటలను నమ్మవద్దని, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో గ్రేటర్‌ రాయలసీమ ఏర్పాటు చేయాలని ఎవరూ కోరడం లేదని స్పష్టం చేశారు. రాయలసీమ పోరాటం కోసం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.
Go Back to Shorts
Byreddy Rajasekar Reddy
rayalaseem uniiversity
Amaravati
jagan

More Telugu News