చాలా కాలం తర్వాత చిరంజీవి, మోహన్ బాబు... కొరటాల చిత్రంలో స్క్రీన్ షేరింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా కాలం తర్వాత చిరంజీవి, మోహన్ బాబు... కొరటాల చిత్రంలో స్క్రీన్ షేరింగ్!

  • ఒకే వేదికపై విమర్శలు గుప్పించుకునే నటులు
  • కొరటాల చిత్రంలో కీలక పాత్రలో మోహన్ బాబు
  • ఇంకా విడుదల కాని అధికారిక ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. టాలీవుడ్ కు ఇద్దరూ విలన్ గా పరిచయమై ఆపై హీరోలుగా మెప్పించిన నటులే. ఇద్దరూ కలిసి బిల్లా - రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. ఆపై చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు, విలన్ గా తనదైన విలక్షణ శైలిలో మెప్పించారు కూడా.  

వీరిద్దరి మధ్యా ఉన్న స్నేహం గురించి మాట్లాడుకుంటే, ముందు గుర్తొచ్చేది టామ్, జెర్రీ క్యారెక్టర్లే! పక్క పక్కనే ఉంటూ నిత్యం పోట్లాడుకుంటున్నట్టే ఇద్దరూ ఉంటారు. ఒకే వేదికపై ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు కూడా సంధించుకుంటుంటారు. అయినా తామిద్దరమూ ఒకటేనని, విభేదాలు పైకి మాత్రమే ఉంటాయని, తమ కుటుంబాలు రెండూ ఒకటేనని ఇద్దరూ చెబుతుంటారు.

ఇక చాలా సంవత్సరాల తరువాత వీరిద్దరూ కలిసి నటించనున్నారన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నారట.

ఈ వార్తపై అధికారిక సమాచారమైతే ఇంతవరకూ వెలువడలేదుగానీ, అదే నిజమైతే, ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందన్నది మాత్రం వాస్తవం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను కూడా కొరటాల తెరకెక్కించాడు.  
Chiranjeevi
Mohan Babu
Koratala Siva
New Movie

More Telugu News