ఆడపులి, దాని పిల్లలు ఆడుకుంటుంటే చూడ్డానికి ఎంత బాగుందో!: సచిన్

  • తడోబా అంధారి టైగర్ రిజర్వ్ లో సచిన్ పర్యటన
  • ప్రత్యేక వాహనంలో విహారం
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన క్రికెట్ గాడ్
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పెద్దపులులను చూసి సచిన్ అచ్చెరువొందారు. తన విహారంపై ట్వీట్ చేశారు. తడోబా టైగర్ రిజర్వ్ లో ఓ ఆడపులి, దాని 4 పిల్లలు ఆడుకోవడం చూస్తే ఎంతో మనోహరంగా అనిపించిందని వెల్లడించారు. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించడాన్ని మరపురాని అనుభూతిగా భావిస్తానని, అందుకు సహకరించిన అక్కడి సిబ్బంది మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఓ ప్రత్యేక వాహనంలో సచిన్ ఇక్కడి అటవీప్రాంతంలో విహరించారు. తడోబా అంధారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉంది. దీన్ని 1995లో ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
Sachin Tendulkar
Tadoba Tiger Reserve
Tigress
Cubs

More Telugu News