తీవ్ర అస్వస్థతతో బాలీవుడ్ దర్శకుడు జగన్శక్తి.. ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్న అక్షయ్ కుమార్!
- మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో కుప్పకూలిపోయిన జగన్శక్తి
- అతని దర్శకత్వంలో 'మిషన్ మంగళ్' చేసిన అక్షయ్
- కోలుకుంటున్న దర్శకుడు
జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ఇటీవల ‘మిషన్ మంగళ్’ చేశాడు. బాక్సాఫీసు వద్ద ఇది సంచలన విజయాన్ని అందుకుంది. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అక్షయ్ చికిత్స ఖర్చులు మొత్తం భరిస్తూ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. జగన్ కుటుంబ సభ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ కోలుకునే వరకు వారితోనే ఉండాలని తన సిబ్బందికి అక్షయ్ సూచించాడు. కాగా, ఆసుపత్రిలో చేరిన జగన్ కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.