kcr: ‘కాంగ్రెస్’ను వీడటం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు: డీఎస్

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ (డీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని, దిగ్విజయ్ సింగ్ తో పడకపోవడం వల్లే ఆ పార్టీ వీడాల్సి వచ్చిందని నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నిజామాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో అనవసరంగా మాట్లాడకూడదన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ తాను మాట్లాడలేదని, బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు చేయొద్దని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు తాను ఏం చేశానని తనను ప్రశ్నిస్తున్నా వారు ముందుగా వాళ్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ కోసం తన ఇంటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా డీఎస్ ప్రకటించారు.
Go Back to Shorts
kcr
cm
Telangana
D.Srinivas
TRS

More Telugu News