అమరావతిని కేంద్రం ఆమోదంతోనే తరలిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు: వైసీపీ, టీడీపీపై పవన్ కల్యాణ్ ఫైర్
- వైసీపీ, టీడీపీలపై పవన్ వ్యాఖ్యలు
- పుకార్లు వ్యాప్తిచేస్తున్నారంటూ ట్వీట్
- తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడి
అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తాము తీసుకున్న మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేవధర్ ఆరోపించారు. అటు చంద్రబాబునాయుడు, ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ దొందేనని విమర్శించారు.