Advertisement

తమిళనాడు సీఎం విజయ్ గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు

Jason Sanjay reacts for the first time on Tamil Nadu CM Vijay victory
  • విజయ్ గెలుపును ఒక 'చారిత్రక విప్లవం'గా అభివర్ణన
  • ఈ గెలుపు తమ కుటుంబంపై మరింత బాధ్యతను పెంచిందన్న జేసన్
  • ప్రస్తుతం నటనపై ఆసక్తి లేదని, దర్శకత్వంపైనే దృష్టి అని స్పష్టీకరణ
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ రాజకీయ విజయంపై ఆయన కుమారుడు, యువ దర్శకుడు జేసన్ సంజయ్ తొలిసారిగా స్పందించాడు. తన తండ్రి సాధించిన ఈ విజయాన్ని ఒక "చారిత్రక విప్లవం"గా అభివర్ణించాడు. ఈ గెలుపు తమ కుటుంబంపై అదనపు బాధ్యతను మోపిందని, ఇకపై తాము మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా జేసన్ మాట్లాడుతూ, "ఇది ఒక చారిత్రక విప్లవం. దీనివల్ల నాపై, నా సోదరిపై, మా కుటుంబంపై వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత పెరిగింది. ఆ వారసత్వాన్ని మేం నిలబెట్టుకోవాలి. ఇకపై చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది" అని తెలిపాడు. తన తండ్రి విజయ్ తనను ఎప్పుడూ స్వశక్తితో ఎదగాలని ప్రోత్సహించేవారని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. "నాన్న నన్ను ఎప్పుడూ స్పూన్ ఫీడ్ చేయలేదు. అందుకు నేను ఆయనకు, అమ్మకు, నా కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాను" అని జేసన్ వివరించాడు.

ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న 'సిగ్మా' చిత్రంపైనే పూర్తి దృష్టి సారించానని, నటనపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని జేసన్ సంజయ్ స్పష్టం చేశారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతోనే జేసన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తన కుటుంబంపై వచ్చే విమర్శలు, ప్రశంసలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని, కుటుంబం నుంచి తనకు ప్రేమతో పాటు గొప్ప బాధ్యత కూడా లభించిందని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Jason Sanjay
Thalapathy Vijay
Tamil Nadu CM Vijay
Sigma Movie Sundeep Kishan
Jason Sanjay Directorial Debut

More Telugu News