పాకిస్థాన్‌లో మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకునే వారికి బంపర్‌ ఆఫర్‌!

  • నూతన కల్యాణ మండపం నిర్వాహకుల బహుమతి
  • రెండో పెళ్లి చేసుకుంటే 50 శాతం...మూడో పెళ్లికి 75 శాతం డిస్కౌంట్‌
  • నాలుగో పెళ్లయితే పూర్తిగా ఉచితం
మార్కెటింగ్‌ టెక్నిక్ లు రకరకాలు. అక్కడి సామాజిక పరిస్థితులు, ప్రజల జీవన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. పాకిస్థాన్‌లో ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకునే సదుపాయం అక్కడి రాజ్యాంగం కల్పిస్తోంది. ఈ సదుపాయాన్నే తన మార్కెట్‌ పెంచుకునే చిట్కాగా వాడుకుంటున్నాడు అక్కడి ఓ నూతన కల్యాణ మండపం నిర్వాహకుడు.

 అదెలా అంటే తన కల్యాణ మండపంలో రెండో పెళ్లి చేసుకుంటున్న వారికి నిర్వహణ వ్యయంలో యాభై శాతం డిస్కౌంట్‌ ఇస్తానని ప్రకటించాడు. మూడో పెళ్లి చేసుకుంటే 75 శాతం డిస్కౌంట్‌, నాలుగో పెళ్లి చేసుకున్న వ్యక్తికి కల్యాణ మండపం పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. కాకపోతే చిన్న కండిషన్‌ పెట్టాడు. కల్యాణ మండపాన్ని బుక్‌ చేసేది అతని మాజీ భార్య లేదా భార్యలై ఉండాలని స్పష్టం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.
Go Back to Shorts
Pakistan
marriages
funcion hall
discount

More Telugu News