KCR: ఏపీ సీఎం జగన్‌కు స్వాగతం పలికిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఇద్దరూ కలిసి భోజనం

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కలిసి కాసేపట్లో భోజనం చేస్తారు. అనంతరం వారిరువురూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు.
Go Back to Shorts
KCR
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News