జాతీయ రహదారి దిగ్బంధానికి సిద్ధమైన రైతులు.. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- నక్కా ఆనందబాబు, బోడె ప్రసాద్ తదితరుల గృహ నిర్బంధం
- కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు నేతలు, కార్యకర్తలు అరెస్ట్
- దిగ్బంధానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ఏర్పాటు
మంగళగిరిలో టీడీపీ నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, తాడేపల్లి పట్టణ, రూరల్ టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకుండా చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.