తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్!
- హుజూర్ నగర్ లో కార్యకర్తల సమావేశం
- ప్రకటించిన ఉత్తమ్ కుమార్
- సొంత నియోజకవర్గానికి అందుబాటులో ఉండేందుకేనని వెల్లడి
నేడు ఆయన హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవిని త్యజిస్తున్నానని కార్యకర్తలతో చెప్పారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేశారు. కాగా, ఉత్తమ్ కుమార్ ప్రకటనపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.