పప్పూ! నీది సార్ధక నామధేయం: విజయసాయి రెడ్డి ఎద్దేవా
Add ap7am to your home Screen

పప్పూ! నీది సార్ధక నామధేయం: విజయసాయి రెడ్డి ఎద్దేవా

  • జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి
  • దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటున్నాడు
  • నీ జ్ఞానం చూసి మీ నాన్నకు నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదు 
టీడీపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పప్పూ! నీది సార్ధక నామధేయం అంటూ ట్వీట్ చేశారు. 'జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్థం చేసుకున్నావంటే... నీ ఇంగ్లిషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజూ ప్రెస్ మీట్లల్లో ఫ్రస్టేట్ అవుతున్నాడు' అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

కాగా, సుజనా చౌదరిపై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరగకపోతే ఈ దేశంలో చట్టం, న్యాయం మీద నమ్మకం పోతుందని ఆయన పేర్కొన్నారు. విచారణ అడిగితే అందుకు తాను 'సిద్ధం'  అని చెప్పకుండా తన జీవితం 'తెరిచిన పుస్తకం' అంటున్నాడని విమర్శించారు. 'ఔను అది  తెరిచిన పుస్తకం. బ్యాంకులను వేల కోట్లలో ముంచిన పుస్తకం' అని ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
Nara Lokesh
YSRCP

More Telugu News