ముస్లింలకు నేను చేసినంత మేలు మరే సీఎం చేయలేదు: నాదెండ్ల భాస్కరరావు

  • పౌరసత్వ చట్టంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి
  • ఈ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదు
  • అల్లర్లు చేయడం దేశంలో కొందరికి అలవాటుగా మారింది
పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు. ఈ చట్టం గురించి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పౌరసత్వ చట్టం ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టమని ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఈ చట్టంపై లోక్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని అన్నారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు. అల్లర్లు చేయడం దేశంలో కొందరికి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ముస్లింలకు తాను చేసినంత మేలు మరే ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు.
Go Back to Shorts
Nadendla Bhaskara Rao
BJP

More Telugu News