Narendra Modi: రామ్ లీలా మైదానంలో మోదీ ర్యాలీకి వేలాదిగా తరలివస్తోన్న ప్రజలు.. ఫొటోలు ఇదిగో

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ 'భారత్ బచావో' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు అదే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఇందులో పాల్గొని ప్రసంగించనున్నారు.
    ఈ ర్యాలీకి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. నేటి ర్యాలీలో ఢిల్లీలో బీజేపీ కూడా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. రామ్ లీలా మైదాన పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
   
మోదీ, అమిత్ షా భారీ కటౌట్లు...    మెట్రోలో రామ్ లీలా మైదానానికి నేతలు..
 
Go Back to Shorts
Narendra Modi
BJP

More Telugu News