నౌకాదళంలో కలకలం.. పాక్ తో సంబంధాల ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టు
- గూఢచర్య వ్యవహారం కేసులో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
- నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాల సంయుక్త ఆపరేషన్
- హవాలా ఆపరేటర్ నూ అదుపులోకి తీసుకున్న ఇంటెలిజన్స్ అధికారులు
- విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు నిందితుల తరలింపు
మొత్తం ఏడుగురు నౌకాదళ సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. మరోవైపు హవాలా ఆపరేటర్ ను కూడా ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.