Tollywood: అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతును బీబీ మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తనకు తెలుసని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Tollywood
Ali
Janasena
Pawan Kalyan

More Telugu News