‘సైరా’కు పన్ను మినహాయింపు లేకపోవడంతో.. రూ. 20 కోట్ల వరకు జీఎస్టీ చెల్లించిన రామ్‌చరణ్!
- నిరాశపరిచిన సినిమా వసూళ్లు
- ‘సైరా’ సినిమాకు లభించని పన్ను మినహాయింపు
- జీఎస్టీ రూపంలో భారీగా చెల్లించుకున్న రామ్‌చరణ్
స్వాతంత్ర్య సమరయోధుడి గాధతో తెరకెక్కించిన ఈ సినిమాకు నిజానికి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఉంటుందని భావించారు. అయితే, ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి నిరాశ ఎదురైంది. దీంతో జీఎస్టీ రూపంలో భారీగా చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాకు జీఎస్టీ రూపంలో రాంచరణ్ ఏకంగా రూ. 20 కోట్ల వరకు చెల్లించినట్టు టాలీవుడ్ టాక్.