సుప్రీంకోర్టు స్టే విధించింది.. దీనిపై నిర్ణయం తీసుకోలేం: ఎన్ కౌంటర్ మృతదేహాలపై హైకోర్టు
- ఎన్ కౌంటర్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
- ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్ జనరల్ కు ఆదేశం
- కేసు తదుపరి విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా
గత నెలలలో వెటర్నరీ వైద్యురాలు దిశపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి ఆమెను పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టు ఆదేశం ప్రకారం రిమాండ్ కు తరలించారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడికి దిగిన సమయంలో, జరిగిన ఎన్ కౌంటర్లో నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.