వివేకా హత్య వెనుక నేనున్నానని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటా: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి!
- కావాలనే నా పేరు తెస్తున్నారు
- ఈ ఉదయం 8 గంటలకు నోటీసులు అందాయి
- సిట్ విచారణకు హాజరు కాబోతున్నాను
కాగా, ఈ కేసులో విచారణకు రావాలని ఆదినారాయణరెడ్డికి కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్వగ్రామమైన జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఈ నోటీసులను అధికారులు ఆదినారాయణరెడ్డికి ఇచ్చారు. నోటీసులపై స్పందించిన ఆది, కడపకు వెళ్లి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నానని అన్నారు. తనకు ఈ ఉదయం 8 గంటలకు నోటీసులు అందాయని ఆయన చెప్పారు.