ఓటీటీకి మృణాల్ ఠాకూర్ 'పూజా మేరీ జాన్'
- హిందీలో రూపొందిన 'పూజా మేరీ జాన్'
- ప్రధానమైన పాత్రను పోషించిన మృణాల్ ఠాకూర్
- కీలకమైన పాత్రలో కనిపించనున్న హుమా ఖురేషి
- స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న 'జీ 5'
- అక్టోబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఒక వైపున క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు దూసుకుపోతుంటే, మరో వైపున కోర్టు రూమ్ డ్రామాలు తమ జోరును కొనసాగిస్తున్నాయి. క్రైమ్ ను .. సస్పెన్స్ ను టచ్ చేస్తూ కోర్టు రూమ్ డ్రామాలు ఉండటం ఈ కాన్సెప్ట్ లకు కలిసొస్తుంది. బలమైన కథ .. కథనం కలిగిన కంటెంట్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్లు ఈ తరహా కంటెంట్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. స్త్రీ ప్రధానమైన పాత్రలతో ఈ తరహా కంటెంట్ రూపొందుతుండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
అలా స్త్రీ ప్రధానమైన రెండు పాత్రల చుట్టూ తిరిగే కథలో ఒక సినిమా రూపొందింది. ఆ సినిమా పేరే 'పూజా మేరీ జాన్'. అక్టోబర్ 2వ తేదీ నుంచి 'జీ 5'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో పూజ పాత్రను మృణాళ్ ఠాకూర్ పోషించారు. ఈ పాత్ర ను కేంద్రబిందువుగా చేసుకునే ఈ కథ నడుస్తుంది. తన స్నేహితుడు చేసిన లవ్ ప్రపోజల్ ను ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. ఫలితంగా ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే అంశం చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లారు.
ఇక ఇటీవల కాలంలో ఓటీటీ సినిమాలతో .. సిరీస్ లతో హుమా ఖురేషి ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు. అలాంటి ఆమె ఈ సినిమాలో లాయర్ 'సనా' పాత్రను పోషించారు. పూజకి న్యాయం చేయడం కోసం పోరాడే ఒక ధైర్యవంతురాలైన లాయర్ గా ఆమె ఈ పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు ఈ సినిమాకి రెండు కళ్లుగా చెప్పుకోవలసి ఉంటుంది. నవజోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి.