సోనియా గాంధీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

  • ట్విట్టర్ ద్వారా ప్రధాని శుభాకాంక్షలు
  • ప్రముఖులతో పాటు పార్టీ శ్రేణుల నుంచీ గ్రీటింగ్స్
  • దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల నిర్వహణలో కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నేడు ఆమె జన్మదినం సందర్భంగా ప్రముఖులతో పాటు, ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా ‘శ్రీమతి సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆమె ఇలాగే ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు. ఇక తమ నాయకురాలి పుట్టిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
sonia birthday
congress
modi greetings to sonai

More Telugu News